Header Banner

పిఠాపురంలో అభివృద్ధికి శ్రీకారం.. పవన్‌కల్యాణ్ పర్యటనకు ఘన స్వాగతం! సమస్యల పరిష్కారానికి హామీ!

  Thu Apr 24, 2025 09:32        Politics

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పర్యటన అధికారికంగా ఖరారైంది. పిఠాపురం నియోజకవర్గంలో జరిగే పర్యటనలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు శంకుస్థాపనలు చేయనున్నారు. వంద పడకల ఆస్పత్రి పనులు ప్రారంభించనున్నారు. రచ్చబండలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు.

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయంనుంచి ఈనెల 25న ఉదయం 9.20 గంటలకు పిఠాపురం పాతబస్టాండు వద్దగల ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకు ని అక్కడ ఉదయం 9.30గంటల నుంచి 10.15గంటల వరకూ నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడినుంచి మధ్యాహ్నం 11గంటలకు కొత్తపల్లి చేరుకుని అక్కడ టీటీడీ కల్యాణ మండపం నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహిస్తారు. అక్కడినుంచే గొల్లప్రోలు, చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానాల్లోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పిఠాపురం రథాలపేట అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాలుకు చేరుకుని అక్కడ జరిగే టైలరింగ్‌ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తారు.

అనంతరం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో యాంత్రీకరణ పథకం ద్వారా పరికరాలు, రైతులకు టార్పాలిన్లు అందజేస్తారు. మధ్యాహ్నం 12.35గంటలకు పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి చేరుకుని 100 పడకల ఆస్పత్రి అప్‌గ్రేడేషన్‌ పనులకు శంకుస్థాపన చేసి అక్కడనుంచే సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. అనంతరం 1.15గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో మంగళగిరి వెళ్తారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ఆదేశించారు. పవన్‌పర్యటించే ప్రాంతాల్లో ఎస్పీ బిందు మాధవ్‌, జేసీ రాహుల్‌మీనా, జనసేన పిఠాపురం ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావులతో కలిసి బుధవారం ఆయన పరిశీలన జరిపారు. హెలిప్యాడ్‌, పిఠాపురం ప్రభుత్వాస్పత్రి, రచ్చబండ నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా, డివిజన్‌స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. ఆయన వెంట కాకినాడ ఏఎస్పీ దేవరాజ్‌మనీష్‌ పాటిల్‌, అడిషనల్‌ ఎస్పీ భాస్కరరావు, డీఆర్‌వో వెంకట్రావు, పాడా ప్రాజెక్టు అధికారి చైత్రవర్షిణి ఉన్నారు.

ఇది కూడా చదవండి: లోక్‌సభ మహిళా సాధికారత కమిటీలో దక్షిణం నుంచి ఆ ముగ్గురు నేతలు! మహిళల అభివృద్ధికి కొత్త దిశ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PawanKalyan #PithapuramTour #DevelopmentMission #JanasenaForPeople #DeputyCM